కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాల్లో కంకర లారీకి విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. ప్రభుత్వాసుపత్రిలో మరమ్మతుల పనుల జరుగుతుండగా...కంకర వేసుకొని వచ్చిన లారీ ఆన్ లోడ్ చేస్తుండగా...విద్యుత్ తీగలు తగిలి లారీ టైర్లో మంటలు చెలరాగాయి. లారీ మంటల్లో కాలిపోయింది. లారీ డ్రైవర్ ఇస్మాయిల్ స్వగ్రామం ఆదోని.. ఇతని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
సమీపిస్తున్నతుది గడువు...కిట్లను వదిలించుకోవడమే లక్ష్యంగా పరీక్షలు