తన అక్క భూమా అఖిలప్రియ అరెస్టు వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని భూమా నాగ మౌనిక ఆరోపించారు. ఆదివారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని తన నివాసంలో తెదేపా కార్యకర్తలతో సమావేశమైన ఆమె.. కీలక వ్యాఖ్యలు చేశారు. హఫీజ్ పేట భూ వ్యవహారం ఒక్కటే తన అక్క అరెస్టుకు కారణం కాదని అన్నారు. ఎన్నో రాజకీయ కుట్రలు, అధికారులపై ఒత్తిళ్లు ఉన్నాయన్నారు. అఖిలప్రియ ఆరోగ్యం బాగలేదని చెప్పినా పోలీసులు కనీసం మందులు ఇచ్చేందుకు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అక్క బెయిల్పై బయటకు రాగానే కుట్ర కోణంలోని అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. ఆడపిల్ల అని కూడా చూడకుండా తన సోదరిని వేధిస్తున్నారని మౌనిక వాపోయారు. తమను రాజకీయంగా అణగదొక్కాలని ప్రత్యర్థులు ఎంత ప్రయత్నించినా గట్టిగా బదులు ఇస్తామన్నారు.
ఇదీ చదవండి
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో.. అఖిల ప్రియ భర్త కోసం పోలీసులు గాలింపు