కరోనా నివారణ సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. వివిధ సంస్థల యాజమాన్యాలు వైయస్ జగన్ను కలిసి చెక్కులను అందజేశాయి. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రూ. 75 లక్షల విరాళం ఇచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ను కలిసిన పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె. రామమోహన్ రావుకు చెక్కు అందించారు.
సీఎం సహాయనిధికి ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రూ. 50 లక్షల విరాళం అందించింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. వి రామచంద్రారెడ్డి సీఎంకు చెక్కు అందించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు.
ఇదీచూడండి. ఇంతా బిల్లు వస్తే..ఎలా బతికేది..?