కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు జాతీయ రహదారిపై స్వర్ణ భారత్ ట్రస్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బైకును ఢీకోట్టడంతో... ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పొట్టిపాడు గ్రామానికి చెందిన మిరియాల వీరస్వామి, కారుకొండ సురేష్లుగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: అపార్ట్మెంట్పై పిడుగు.. తప్పిన పెను ముప్పు