కర్నూలులోని నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబం కేసును సీబీఐ విచారణ చేపట్టాలని... హోం మంత్రి సుచరితకు తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ లేఖ రాశారు. సీబీఐ ఎంక్వైరీ వేస్తామని ఈ నెల 4న శాసనమండలిలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రకటన చేసి 24 రోజులు గడుస్తున్నా ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ముస్లీంలకు అండగా ఉంటామన్న ప్రభుత్వం సలాం విషయంలో సీబీఐ దర్యాప్తు ఎందుకు ఆదేశించలేదన్నారు.
ఒక ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా... సరైన సమయంలో స్పందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందనుకోవాలా అని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే సీబీఐ ఎంక్వైరీకి ఉత్తర్వులు ఇవ్వాలని డింమాడ్ చేశారు. సీఐ, హెడ్ కానిస్టేబుల్ ను ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు. ఈ కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
ఇదీ చదవండి: