ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణుల ఆందోళన

కాపు కల్యాణ మండపాలను త్వరితగతిన నిర్మించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వైకాపా ప్రభుత్వం నిలిపివేసిందని వారు ఆరోపించారు.

ఆందోళన చేపట్టిన తెదేపా శ్రేణులు
ఆందోళన చేపట్టిన తెదేపా శ్రేణులు
author img

By

Published : Nov 8, 2020, 4:03 PM IST

విజయవాడలో తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. కాపు కల్యాణ మండపాలు త్వరితగతిన నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు గత ప్రభుత్వం కాపు కల్యాణ మండపాలకు కేటాయించిన స్థలాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాపు అభివృద్ధికై గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను వైకాపా ప్రభుత్వం నిలిపివేసిందని తెదేపా శ్రేణులు ఆరోపించారు.

కాపుల సంక్షేమానికి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి విదేశీ విద్య, స్వయం ఉపాధికి రుణాలు వంటి పథకాలను నిలిపివేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు తీరని అన్యాయం చేశారన్నారు. తక్షణమే దాసరి నారాయణరావు, వంగవీటి మోహన రంగా పేర్లతో గత ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో కల్యాణ మండపాలు నిర్మించాలని కోరారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ పేరిట వైకాపా ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని తూర్పు గోదావరి జిల్లా లంకలగన్నవరం గ్రామానికి చెందిన తెదేపా నేత డొక్కా జగన్నాథం విమర్శించారు. పేదలకు ప్రభుత్వం వెంటనే పక్కా ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లాలో..

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సొంత ఇంటి కోసం ఇప్పటికే డబ్బులు చెల్లించిన 450 మంది లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను ప్రభుత్వం స్వాధీనం చేయాలని తెదేపా నియోజకవర్గ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. నా ఇల్లు నా సొంతం కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా కంబదూరు శెట్టూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఇదీ చదవండి

మళ్లీ ఊపందుకుంటున్న శుభకార్యాలు..చాలామందికి ఉపాధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.