విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసం నాలుగో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం అమ్మవారికి ప్రీతికరమైన మాసం కావడంతో…దుర్గమ్మ సన్నిధిలో ముంబయికి చెందిన పండితులు శ్రీధరాచార్యి ఆధ్వర్యంలో రేఖాచిత్రం రూపొందించి.. ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాదిమఠంలో ప్రతి శుక్రవారం అమ్మవారి విశేష పూజలు జరిగేవి. ఈసారి అమ్మవారి సన్నిధిలో ఈ పూజలు చేశారు. గర్భగుడిలో ఒక రూపంలోనూ... రేఖాచిత్రంలో మరో రూపంలో జగన్మాత దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇచ్చారు.
ఇవీ చదవండి: భద్రాచలం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి