ఆడపిల్లలకు భరోసా కల్పించడానికి ప్రత్యేకంగా 'మహిళా మార్చ్' కార్యక్రమాన్ని వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లబ్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని మారిస్ స్టెల్లా కాలేజీలో మహిళా మార్చ్ వంద రోజుల కార్యక్రమం నిర్వహించారు.
సమాజంలో మహిళల పట్ల ఎదురవుతున్న వివక్షతను ధైర్యంగా ఎదుర్కొనేలా జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందించిందని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాలేజీలో నూతనంగా ఏర్పాటు చేసిన కాలేజీ కాప్స్ వాలంటీర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా పోలీసు విభాగం ఎస్పీ ఐ. రాధిక, మహిళా కమిషన్ సభ్యులు, కళాశాల యాజమాన్యం, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: