విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు కేవీఆర్ కాలనీకి చెందిన పలువురు గత రెండ్రోజులుగా అస్వస్థత(Illness)కు గురయ్యారు. ఒకరి తర్వాత మరొకరు వాంతులు, విరేచనాల బారినపడడంతో అధికార యంత్రాంగం ముమ్మర పారిశుద్ధ్య చర్యలు, వైద్య పరీక్షలు నిర్వహించింది. కేవలం ఆహార కల్తీ, ఇతర కారణాలతోనే పలువురు స్వల్ప అస్వస్థతకు గురైనట్లు ఉప్పులూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సుందర్ తెలిపారు.
ప్రస్తుతం కాలనీవాసుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న ఆయన.. స్థానికంగా ఈ లక్షణాలతో ఎవరూ చనిపోలేదన్నారు. ఇప్పటికే కాలనీకి సరఫరా అయ్యే త్రాగునీటి పరీక్షలను అధికారులు నిర్వహించగా.. ఎటువంటి లోపం లేదన్నారు. పరిస్థితికి గల కారణాలను లోతుగా విశ్లేషిస్తున్నామని వివరించారు. కాలనీలో అపరిశుభ్ర వాతావరణంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వడంతో జిల్లా అంటువ్యాధుల నిపుణుల బృందం కాలనీలో పర్యటించనుంది.
ఇదీ చదవండి: