ETV Bharat / state

సైబర్​నేరాలు అరికట్టేందుకు సాంకేతికతపై మరింత పట్టు

సైబర్​ నేరాలు పోలీసులకు సవాల్​గా మారుతున్నాయి. వేల కిలో మీటర్ల దూరం నుంచి ఒక్క బటన్ నొక్కి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. ఫోన్ హ్యాక్ చేసి బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఈ తరహా కేసులను ఛేదించేందుకు పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తుంటారు. వీలైనంత త్వరగా నేరగాళ్లను పట్టుకునేందుకు విజయవాడలో సైబర్ పోలీస్​ సిబ్బందికి మెరుగైన శిక్షణను అందిస్తున్నారు.

cyber police
శిక్షణ పొందుతున్న సైబర్​క్రైమ్ పోలీసులు
author img

By

Published : Nov 9, 2020, 7:51 AM IST

సైబర్​క్రైమ్​ నేరగాళ్లు విజయవాడ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని తప్పించుకుంటున్నారు. వివిధ రకాల సాఫ్ట్​వేర్​లను ఉపయోగించుకుని తమ ఉనికి తెలియకుండా జాగ్రత్తపడుతుంటారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఆధారాలను మాయం చేస్తుంటారు. ఈ నేరాలను అరికట్టేందుకు..నిందితులను పట్టుకునేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నామని సైబర్​ క్రైమ్​ పోలీసులు చెబుతున్నారు. నిందితులను గుర్తించటం, కొత్త సాఫ్ట్​వేర్​ అంశాలపై నిపుణులతో శిక్షణ తీసుకుంటున్నామన్నారు.

డార్క్​వెబ్​సైట్ల నుంచి...

సైబర్​ నేరగాళ్లు డార్క్​వెబ్ నుంచి నేరాలకు పాల్పడుతుంటారు. మారుపేర్లు, నకిలీ ఐపీ అడ్రస్​లు, ప్రాక్సీ సర్వర్లను వినియోగిస్తూ తప్పించుకుంటారు. నిందితుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఖచ్చితంగా కొన్ని డిజిటల్ ప్రింట్స్ వదిలేస్తాడు. వాటిని ఉపయోగించి ఆధారాలు సేకరించవచ్చు. ఎక్కడో ఉండి ఇంక్కెక్కడి నుంచో మోసాలకు పాల్పడటం వల్ల కేసులు ఛేదించటం కొంత ఆలస్యం కావచ్చు. కానీ నేరస్థున్ని ఖచ్చితంగా పట్టుకోవచ్చు - శ్రీనివాసరావు, సైబర్ క్రైమ్ ఇన్స్ పెక్టర్ ,విజయవాడ

ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా వెబినార్ ద్వారా సైబర్ నేరాలను చేధించటంపై శిక్షణ పొందుతున్నామని విజయవాడ సైబర్​క్రైమ్ పోలీసులు తెలిపారు. సైబర్​క్రైమ్​ను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పోలీస్​స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. దీంతోపాటు నూతన సైబర్​టూల్స్ అందుబాటులో ఉంచామన్నారు. ఎప్పటికప్పుడు సాఫ్ట్​వేర్​లను అప్​డేట్ చేస్తుంటామని చెప్పారు. నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఇదీ చదవండి:

విజయవాడలో మాంసం మాఫియా గుట్టురట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.