విజయవాడలో నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎనిమిదో డివిజన్లో వైకాపా అభ్యర్థి తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్ ప్రచారం చేపట్టారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కరోనా లాక్డౌన్ సమయం నుంచి ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తున్నానని ఎనిమిదో డివిజన్ అభ్యర్థి రజినీ పేర్కొన్నారు చేశారు. సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని 28వ డివిజన్ భాజపా అభ్యర్థి శివనాగేశ్వరరావు పేర్కొన్నారు. భాజపాతో పాటు జనసేన అభ్యర్థులను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
సీపీఎంతోనే అభివృద్ధి సాధ్యం
విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో 22వ డివిజన్ సీపీఎం అభ్యర్థి చిన్నారావు విజయాన్ని కాంక్షిస్తూ... సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. మధు ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి చేసే వ్యక్తులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. భాస్కర్రావుపేటను అభివృధి పథంలో నడిపించడం సీపీఎం వల్లే సాధ్యమవుతుందని మధు స్పష్టం చేశారు.
ఇదీచదవండి.