ETV Bharat / state

'కరోనా కేసులు లేని ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు' - CM Review on Migrant laborers

కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. 14 రోజులుగా కరోనా కేసులు నమోదు కాని ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జులై 1 నాటికి ప్రతి పీహెచ్‌సీకి ఒక ద్విచక్రవాహనం అందుబాటులోకి తీసుకురావాలని...వలస కూలీలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

CM Review on Carona
సీఎం జగన్
author img

By

Published : May 14, 2020, 7:03 PM IST

కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, మోపిదేవి వెంకట రమణ, సీఎస్‌, డీజీపీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహలపై పలు నిర్ణయాలను తీసుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 290 క్లస్టర్లు ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 75 క్లస్టర్లలో 28 రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాలేదని... ఆ ప్రాంతాలను డీనోటిఫై చేసి సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. 14 రోజుల్లో కేసులు నమోదు కాని ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.

నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీల అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. వలస కూలీలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని... స్వస్థలాలకు పంపడంపై ఆలోచన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వారు వెళ్తున్నప్పుడు ఆకలి బాధలు లేకుండా అన్నపానీయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అంతేగాక ప్రతి పీహెచ్‌సీకి జులై 1 నాటికి ఒక ద్విచక్రవాహనం ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇదీచూడండి.

'ఈ-పాస్​తో పాటు గుర్తింపుకార్డు తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.