ETV Bharat / state

'విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు ద్వారా వివాదాలకు ముగింపు' - కేంద్ర పంచాయితీరాజ్ జాయింట్ సెక్రటరీ అలోక్ ప్రేమ్ నగర్

ప్రతీ భూభాగానికీ విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు ద్వారా వివాదాలకు ముగింపు పలికే అవకాశముంటుందని కేంద్ర పంచాయితీరాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి ఆలోక్ ప్రేమ్ సాగర్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న స్వామిత్వ కార్యక్రమం ద్వారా ఏపీలోని కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం గ్రామీణ ప్రాంతంలో చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని భూముల రీసర్వే ప్రాజెక్టును ఆయన పరిశీలించారు.

central team
central team
author img

By

Published : Aug 18, 2021, 8:23 PM IST

ప్రతీ భూభాగానికీ విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు ద్వారా వివాదాలకు ముగింపు పలికే అవకాశముంటుందని కేంద్ర పంచాయితీరాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి ఆలోక్ ప్రేమ్ సాగర్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న స్వామిత్వ కార్యక్రమం ద్వారా ఏపీలో చేపట్టిన భూముల రీసర్వే ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం గ్రామీణ ప్రాంతంలో చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని కేంద్ర బృందంతో కలిసి ఆయన తనిఖీ చేశారు. భూ లావాదేవీల్లో వివాదాలు లేకపోవటంతో పాటు భూ యజమానులకు భరోసా వచ్చేలా ఈ స్వామిత్వ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.

మచిలీపట్నం మండలం పొట్లపాలెం గ్రామంలో సర్వే ఆఫ్‌ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన స్వామిత్వా ( సర్వే అఫ్ విలేజస్ అండ్ మాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా కార్యక్రమానికి కేంద్ర బృందం హాజరయ్యింది. సర్వే ఆఫ్‌ ఇండియా సంయుక్త భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వేను చేపట్టిందని కేంద్ర సంయుక్త కార్యదర్శి స్పష్టం చేశారు.

'ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం'

ఈ కార్యక్రమం ద్వారా భూమి సబ్‌ డివిజన్‌ సమస్యలు కూడా తొలగిపోతాయిని వివరించారు. ఆస్తి, క్రయ, విక్రయ, తనఖా, దాన, వారసత్వ, ఇతర లావాదేవీలు వివాదరహితం కానున్నట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కూడా గ్రామంలోనే చేసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. డ్రోన్, కార్స్, రోవర్‌ వంటి పరికరాల ద్వారా ప్రతి స్థిరాస్తిని కచ్చితమైన భూ అక్షాంశ–రేఖాంశాలతో గుర్తించి కొత్తగా సర్వే, రెవెన్యూ రికార్డులు రూపొందిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ సర్వే పూర్తైన తర్వాత ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం ఇస్తారని రెవెన్యూ రికార్డులు, ఇతర వివరాలు గ్రామాల్లో డిజిటల్‌ రూపంలో కూడా అందుబాటులో ఉంటాయిని కేంద్ర పంచాయితీరాజ్ జాయింట్ సెక్రటరీ అలోక్ ప్రేమ్ నగర్ వెల్లడించారు.

ఇదీ చదవండి:

Flash సీఎం జగన్‌కు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు..విచారణకు హాజరు కావాలని ఆదేశం

IPL 2022: వచ్చే ఐపీఎల్​లో 10 జట్లు ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.