కృష్ణ జిల్లా విజయవాడ నగర శివారులోని రామవరప్పాడు కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతిచెందింది. ద్విచక్రవాహనంపై విజయవాడ వైపు వెళుతుండగా వెనక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. మృతురాలు సింగ్‌నగర్ రాజరాజేశ్వరిపేటకు చెందిన వాయిల రేవతిగా పోలీసులు గుర్తించారు. లారీ చోదకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. యువతి పాలిట శాపం - విజయవాడ తాజా వార్తలు
అతి వేగం ఓ నిండు ప్రాణం బలితీసుకుంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం యువతి పాలిట శాపంగా మారింది. విజయవాడ నగరశివారులోని రామవరప్పాడు కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది.
లారీ ఢీకొని యువతి మృతి
కృష్ణ జిల్లా విజయవాడ నగర శివారులోని రామవరప్పాడు కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతిచెందింది. ద్విచక్రవాహనంపై విజయవాడ వైపు వెళుతుండగా వెనక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. మృతురాలు సింగ్‌నగర్ రాజరాజేశ్వరిపేటకు చెందిన వాయిల రేవతిగా పోలీసులు గుర్తించారు. లారీ చోదకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పోలీసు కస్టడీలో నిందితుడి మృతి