ETV Bharat / state

ఆంధ్రా ప్యారిస్​లో ఆసక్తిగా పురపోరు..!

గుంటూరు జిల్లాలోనే పురాతన పురపాలికల్లో అది ఒకటి. ప్రత్యేక మున్సిపాలిటిగా హోదా పొందింది. స్వచ్ఛత పరంగా జాతీయస్థాయిలో అవార్డులు సాధించిన ఘనత ఉంది. అలాంటి పురపాలికలో ఈసారి మున్సిపల్ ఎన్నికలు నువ్వానేనా అన్నట్లు సాగుతున్నాయి. మున్సిపాలిటిపై జెండా ఎగరేయాలని వైకాపా ప్రయత్నిస్తోంటే.. ఎలాగైనా అధికార పార్టీకి గండి కొట్టాలని తెదేపా పట్టుదలతో ఉంది. ఆంధ్రా ప్యారిస్​గా పేరొందిన తెనాలిలో పురపోరు ఆసక్తి కలిగిస్తోంది.

ఆంధ్రా ప్యారిస్​లో ఆసక్తిగా పురపోరు..!
ఆంధ్రా ప్యారిస్​లో ఆసక్తిగా పురపోరు..!
author img

By

Published : Mar 2, 2021, 4:42 PM IST

Updated : Mar 2, 2021, 10:26 PM IST

తెనాలి మున్సిపాలిటికి 112 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. ఎప్పుడో 1909లోనే ఈ పట్టణం మున్సిపాలిటిగా ఏర్పడింది. గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతానికి గుండెకాయ వంటిది తెనాలి పట్టణం. కవులు, కళాకారులు, పోరాటాలకు పుట్టినిల్లుగా భాసిల్లుతూ వస్తోంది. బ్రిటీషు కాలం నుంచే మంచి వ్యాపార కేంద్రంగా పేరుగాంచింది. ఇలాంటి ఎన్నో విశిష్టతలున్న తెనాలిలో మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా, తెదేపా పాగా వేసేందుకు ధీటుగా పోరాడుతున్నాయి.

మున్సిపాలిటీ జనాభా 2 లక్షలు కాగా.. లక్షా 55 వేల మంది ఓటర్లున్నారు. గత పాతికేళ్లలో కాంగ్రెస్, తెదేపా చెరో రెండుసార్లు ఇక్కడ గెలుపొందాయి. పట్టణంలో మొత్తం 40 వార్డులున్నాయి. మైనార్టీలు, యాదవుల జనాభా ఎక్కువగా ఉండటంతో ఎన్నికల్లో గెలుపుఓటముల్ని వారే నిర్దేశించనున్నారు. ఈ సారి తెదెపా, వైకాపా అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది.

ఆలపాటి రాజేంద్రప్రసాద్

మాజీమంత్రి, తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మున్సిపాలిటిలో ప్రచార బాధ్యతలు మోస్తున్నారు. గత రెండేళ్లుగా వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఆస్తిపన్ను పెంచటం ద్వారా ప్రజలపై పడే భారాన్ని వివరిస్తోంది. తమని గెలిపిస్తే ఆస్తిపన్ను పెంచబోమని హామీ ఇస్తున్నారు. ప్రశాంతంగా ఉండే తెనాలిలో వైకాపా అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలు, నేరాలు పెరిగాయని.. అలాంటి వాతావరణం పోవాలంటే తెదేపాకు ఓట్లేయాలని ఆ పార్టీ అభ్యర్థులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

తెనాలి మున్సిపాలిటికి సెలక్షన్ గ్రేడ్ హోదా కోసం 20 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లినా ఇప్పటికి ఆమోదం రాలేదు. సెలక్షన్ హోదా వస్తే మున్సిపాలిటికి వచ్చే నిధులు పెరుగుతాయి. పట్టణంలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. బయటి గ్రామాల నుంచి విజయవాడ, గుంటూరు వైపు వెళ్లేందుకు 40 కోట్ల రూపాయలతో రింగురోడ్డు నిర్మాణం ప్రారంభమైనా.. వైకాపా అధికారంలోకి వచ్చాక పనుల నిలిపివేశారు.

అన్నాబత్తుని శివకుమార్

2005లో 100 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకానికి సంబంధించి పైప్ లైన్ నిర్మాణం పూర్తయింది. కానీ ఇంటింటికి కనెక్షన్లు ఇవ్వలేదు. పట్టణం గుండా వెళ్లే మూడు సాగునీటి కాలువల నిర్వహణ సరిగా లేదు. అందులోనే చెత్తాచెదారం వేస్తుండటం ఇబ్బందిగా మారింది. కాలువ గట్లు సుందరంగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో గెలిస్తే గట్లను సుందరీకరించి.. అక్కడ తెనాలికి చెందిన మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు.

అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ శివకుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ ఛైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. వైకాపా గెలిస్తే ఆ రెండు వర్గాల వారికి చెరో రెండున్నరేళ్లు ఛైర్​పర్సన్ పదవి ఇస్తామని ప్రకటించారు. మైనార్టీల నుంచి నసీమ్, వెనుకబడిన వర్గాల నుంచి తాడిబోయిన రాధికను ఛైర్​పర్సన్ అభ్యర్థులుగా ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే శివకుమార్ చెబుతున్నారు. పాతికవేల మందికిపైగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించామని.. మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.

జనసేన-భాజపా అభ్యర్థులు 6చోట్ల మాత్రమే బరిలో దిగారు. కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థులు ఒకరిద్దరు మాత్రమే పోటీ చేస్తున్నారు. ఆయా పార్టీల ప్రభావం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.

ఇదీ చదవండీ... స్టీల్ పాంట్ల్ ఉద్యోగుల భవిష్యత్ కోసం కేంద్రం ఆలోచిస్తోంది: ఎంపీ జీవీఎల్

Last Updated : Mar 2, 2021, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.