గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని రెండు ఆలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ప్రధాన రహదారుల వెంబడి ఉన్న ఆలయాలను టార్గెట్ చేసి దుండగులు దొంగతనం చేశారు. పొన్నపల్లి గ్రామంలోని శ్రీ కనుమూరి అమ్మవారి ఆలయం, నడింపల్లి గ్రామ శివాలయాల్లోకి అర్ధరాత్రి సమయంలో చొరబడి హుండీలను పగలకొట్టి నగదు అపరించుకుపోయారు.
ఉదయం ఆలయం వద్దకు వచ్చిన పూజారులు, స్థానిక భక్తులు ఆలయ తలుపు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గమనించి..పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఆలయాల హుండీల్లో సుమారు 50 వేల రూపాయల కానుకలు, నగదు ఉంటుందని పూజారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Bank Robbery : పొట్టకూటి కోసం బ్యాంక్ దోపిడీ.. దంపతుల అరెస్ట్