ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నేడు పోలీస్ స్టేషన్ నందు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ మాధవరావు విద్యార్థిని, విద్యార్థులకు పోలీస్ స్టేషన్ లోని ఆయుధాలను... పోలీసుల విధులు... కర్తవ్యాలు.. వ్యవస్థ గురించి వివరించారు
గుంటూరు జిల్లా
గుంటూరులో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పోలీస్ కవాతు మైదానంలో నిర్వహించిన ఓపెన్ సెషన్ కార్యక్రమాన్ని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు ప్రారంభించారు. పోలీసులు ప్రతిరోజూ ఉపయోగిస్తున్న ఆయుధాలు.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల వినియోగం.. ప్రెండ్లీ పోలీసింగ్ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
విశాఖపట్నం జిల్లా
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా కైలాసగిరి వద్ద ఆర్ముడ్ రిజర్వ్ కళ్యాణ మండపంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. పోలీసులు తమ విధి నిర్వహణలో ఉపయోగిస్తున్న ఆయుధాలు, వీఐపీ బందోబస్తు సమయాల్లో తీసుకునే జాగ్రత్తలను ప్రదర్శన ద్వారా ప్రజలకు వివరించారు.
అనంతపురం జిల్లా
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరిని స్మరించుకోవాలంటూ ఎస్పీ సత్య యేసు బాబు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా డాగ్ స్క్వాడ్ బృందం దొంగలను పట్టుకునే తీరు.. ఆధారాలు సేకరించే విధానాన్ని ప్రదర్శించారు.
ఇదీ చూడండి: ఎమ్మిగనూరులో పోలీస్ ఓపెన్ హోస్