గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలోని వెంగళరెడ్డి కాలనీకి చెందిన గుంటి శాంతయ్యపై... గత నెల 24న అదే గ్రామానికి చెందిన కొందరు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన గుంటి శాంతయ్యను రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ పరామర్శించారు. దాడి జరిగిన తీరును బాధితున్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో నిందితులకి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని శివాజీ తెలిపారు. ప్రభుత్వం నుంచి 4లక్షల పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. దళిత,గిరిజనులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాధితుడికి అండగా ఎస్సీ,ఎస్టీ కమీషన్ ఉంటుందని...తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండీ...