రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవు..రాష్ట్ర హోం మంత్రి. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. వర్షాకాలంలో చెట్లు పడిపోవడం, తీగలు తెగిపోవడం వంటి కారణాలతో స్వల్ప అంతరాయం ఏర్పడటం సహజమేనని చెప్పారు. వీటిని విద్యుత్ కోతలుగా భావించవద్దన్నారు. గృహ అవసరాలకు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, వ్యవసాయానికి 9 గంటలపాటు విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి.. విశాఖలో "వైకుంఠపాళి "చిత్రం ఆడియో రీలిజ్