గుంటూరు జిల్లా చిలకలూరుపేట మండలం తాతపూడి సమీపంలో 16 నెంబర్ జాతీయ రహదారిపై కారు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని మార్టూరు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిలకలూరిపేట గ్రామీణ ఎస్సై భాస్కర్ తెలిపారు.
ఇదీ చదవండి: రాచగున్నేరి పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం