ETV Bharat / state

రేపల్లెలో నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత - Police seize banned gutka packets in Repalle

రేపల్లెలో గుట్కా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. సుమారు 3 లక్షల 20 విలువచేసే ఖైనీ, గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లను సీజ్ చేశారు.

రేపల్లెలో నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

author img

By

Published : Jun 9, 2021, 9:43 PM IST

గుంటూరు జిల్లా రేపల్లెలో గుట్కా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. గోదాముల్లో నిల్వ ఉంచిన భారీ మొత్తంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 3 లక్షల 20 వేల రూపాయల ఖైనీ, గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లు సీజ్ చేసినట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. గోదాముల్లో నిల్వ ఉంచి అమ్ముతున్న ఓ వ్యక్తినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్సైలు ఫిరోజ్, చాణక్య పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో...

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో ఏడు లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. గుట్కా ప్యాకెట్లతో పాటు 1700 విలువ చేసే మద్యాన్ని పోలీసులు గుర్తించారు. మద్యం, గుట్కాను సీజ్ చేసి రాజేశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై భాస్కరరావు తెలిపారు.

ఇదీ చదవండి: Ap Junior Doctors Strike: జూడాల చర్చలు సఫలం.. సమ్మె విరమణ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.