గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాలను కలిపి కార్పొరేషన్‌గా చేసే ప్రక్రియ వేగంగా సాగుతోందని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇప్పటికే మంగళగిరిని మోడల్ పురపాలక సంఘంగా ప్రభుత్వం గుర్తించిందని, అందులో భాగంగా వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని రాజధాని గ్రామాలను ఆయా పురపాలక సంఘాలలో కలపడం పట్ల ఎలాంటి ఇబ్బందులు లేవని శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ గ్రామాలను గ్రామస్థాయి నుంచి పురపాలక స్థాయికి పెంచితే మరింత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.
ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్ల ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు