ETV Bharat / state

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జనసేన కసరత్తు - ఏపీ తాజా వార్తలు

Janasena executives in Telangana: తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలని ఇటీవల ఆ పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​ పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం మేరకు ప్రస్తుతానికి 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేశారు.

janasena
జనసేన
author img

By

Published : Dec 11, 2022, 7:54 PM IST

Janasena executives in Telangana: తెలంగాణలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ తెలంగాణ కార్యవర్గం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవల పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి నేమూరి శంకర్‌గౌడ్‌ స్పష్టం చేశారు. పవన్‌ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేసినట్టు వెల్లడించారు.

సనత్​నగర్ నుంచి మండపాక కావ్య, జూబ్లీహిల్స్ ఎస్.రమేష్, ముషీరాబాద్ బిట్ల రమేష్, కుత్బుల్లాపూర్ నందగరి సతీశ్​ కుమార్, కూకట్ పల్లి నడిగడ్డ నాగేంద్రబాబు సహా మంచిర్యాల, రామగుండం, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, ఖమ్మం, కొత్తగూడెం, హుజూర్ నగర్, వనపర్తి, సిద్ధిపేట, హుస్నాబాద్, జగిత్యాల, స్టేషన్ ఘన్ పూర్, నర్సంపేట సహా మొత్తం 32 నియోజకవర్గాలకు కార్యనిర్వాహకులను ఎంపిక చేసినట్లు శంకర్‌గౌడ్‌ వివరించారు. వీరంతా వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించి నివేదిక అందజేస్తారని.. ఆ నివేదిక ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.