గుంటూరు జిల్లా మంగళగిరిలో పచ్చడి తయారీ కేంద్రాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళగిరి ఉష, విజయ, ఏవీఆర్ పచ్చడి కేంద్రాలపై 15 మంది అధికారులు ఏక కాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పచ్చళ్ల సీసాలపై ధర, తయారీ తేదీలు తదితర వివరాలు ముద్రించకుండా విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. మూడు కేంద్రాల నుంచి 8 పచ్చళ్ల సీసాల శాంపిల్స్ ఆహార పరిరక్షణ అధికారులకు పంపించామని విజిలెన్స్ సీఐ శ్రీహరిరావు తెలిపారు. శాంపిల్స్ పరీక్షల నివేదికలు రాగానే కేసులు నమోదు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: