ETV Bharat / state

రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్‌ల బదిలీ - ఏపీ తాజా

IAS Transfers in andhra pradesh
IAS Transfers in andhra pradesh
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 9:30 PM IST

Updated : Dec 19, 2023, 10:07 PM IST

21:29 December 19

8 మంది కొత్తవారికి పోస్టింగ్‌

IAS Transfers in AP: రాష్ట్రంలో 17 మంది ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగ్‌ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 9మందిని బదిలీ చేయగా, 8మంది కొత్త వారికి పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శిక్షణ పూర్తి చేసుకున్న 8 మంది ఐఎఎస్ లకు తొలిపోస్టింగ్ ను ప్రభుత్వం ఇచ్చింది. మరో 9 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాప్ ఎండీగా హెచ్ఎం ధ్యానచంద్రను బదిలీ చేశారు. గ్రామవార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ గా టీఎస్ చేతన్ ను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ డైరెక్టర్ గా జె. శివశ్రీనివాసును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తిరుపతి జిల్లా జేసీగా శుభం బన్సల్ ను నియమించారు. గ్రామవార్డు సచివాలయశాఖ అదనపు డైరెక్టర్ గా గీతాంజలీ శర్మను బదిలీ చేశారు. సత్యసాయి జిల్లా జేసీగా అభిషేక్ కుమార్ కు నియమించారు. అల్లూరి జిల్లా జేసీగా కొల్లాబత్తుల కార్తీక్ ను నియమిస్తూ ఉత్తర్వుుల జారీ అయ్యాయి. ఎంఎస్ఎంఈ కార్పోరేషన్ సీఈఓగా సేథు మాధవన్ ను, మద్యాహ్నభోజన ప్రత్యేక అధికారిగా ఎస్ఎస్ శోభిక ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇక శిక్షణ పూర్తి చేసుకున్న పెద్దిటి ధాత్రీ రెడ్డిని పాడేరు సబ్ కలెక్టర్ గా నియమించారు. పెనుకొండ సబ్ కలెక్టర్ గా ఆపూర్వభరత్, కొవ్వూరు సబ్ కలెక్టర్ గా అసుతోష్ శ్రీవాస్తవ, కందుకూరు సబ్ కలెక్టర్ గా జి విద్యార్ధి, తెనాలి సబ్ కలెక్టర్ గా ప్రఖార్ జైన్, మార్కాపురం సబ్ కలెక్టర్ గా రాహుల్ మీనా, ఆదోని సబ్ కలెక్టర్ గా శివ్ నారాయణ్ శర్మ, రంపచోడవరం సబ్ కలెక్టర్ గా ఎస్ ప్రశాంత్ కుమార్​లకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Last Updated : Dec 19, 2023, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.