నకిలీ బంగారు ఆభరణాలు తనఖా పెట్టుకుని రుణం ఇచ్చి బ్యాంకును మోసగిస్తున్న అప్రైజర్ పై గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. హరికృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి బ్రాడీపేటలోని బ్యాంకు ఆఫ్ ఇండియాలో గత కొన్ని సంవత్సరాలుగా అప్రైజర్ గా పని చేస్తున్నారు. ఆయన సోదరుడు రామకృష్ణ మోహన్ బంగారం వ్యాపారం చేస్తున్నాడు. ఆ ఇద్దరు బ్రాడీపేట, కొత్తపేట, శ్రీనగర్, పొన్నూరుకు చెందిన అయిదుగురితో కలిసి కుమ్మక్కయ్యారు.
వన్ గ్రామ్ బంగారు ఆభరణాలు బ్యాంకులో తనఖా పెట్టి 40 లక్షలు రుణం పొందారు. దీనికి బ్యాంకు అప్రైజర్ హరికృష్ణ ప్రసాద్ పూర్తిగా సహకరించాడు. వన్ గ్రామ్ బంగారు ఆభరణాలు కుదవ పెట్టుకుని బ్యాంకును మోసగించినట్లు మేనేజర్ దివ్యాన్షు కుమార్ అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండి: అయోధ్య రామాలయంపై రేపు కీలక నిర్ణయం!