ప్రభుత్వం మద్యం షాపులను తెరచి కరోనా వైరస్ మరింత పెరగడానాకి కారణం అవుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. మద్యం దుకాణాలు తెరిచినందుకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గుంటూరు హిమని సెంటర్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. అసలే లాక్డౌన్తో ప్రజలు డబ్బులు లేక అల్లాడుతుంటే... మద్యం షాపులను తెరచి ప్రజల జేబులను లూటీ చేస్తున్నారని నగర కార్యదర్శి కోట మాల్యాద్రి విమర్శించారు. ప్రభుత్వానికి మద్యంపై ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై లేదని వ్యాఖ్యానించారు.
'మద్యం షాపులు తెరిచి ప్రజలను లూటీ చేస్తున్నారు' - guntur district cpi leader protest news in telugu
రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచి కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందడానికి కారణం అవుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. మద్యం దుకాణాలు తెరవటంపై గుంటూరు హిమని సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం మద్యం షాపులను తెరచి కరోనా వైరస్ మరింత పెరగడానాకి కారణం అవుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. మద్యం దుకాణాలు తెరిచినందుకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గుంటూరు హిమని సెంటర్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. అసలే లాక్డౌన్తో ప్రజలు డబ్బులు లేక అల్లాడుతుంటే... మద్యం షాపులను తెరచి ప్రజల జేబులను లూటీ చేస్తున్నారని నగర కార్యదర్శి కోట మాల్యాద్రి విమర్శించారు. ప్రభుత్వానికి మద్యంపై ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై లేదని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: 'ఒక్కో పేద కటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలి'