గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన చినరామయ్య (65) పక్షవాతంతో ఇబ్బంది పడ్డాడు. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు అతనిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వృద్ధుడు 3వ తెదీన చనిపోయాడు. మృతదేహానికి కొవిడ్ పరీక్షలు చేసి నెగెటివ్ అని చెప్పి వైద్యులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. 4వ తేదీన కుటుంబసభ్యులు అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో బంధువులంతా పాల్గొన్నారు.
అంత్యక్రియల జరిగిన రెండు రోజుల తరువాత 6వ తేదీన వృద్దునికి కరోనా పాజిటివ్ అని స్థానిక పోలీసుకు సమాచారం వచ్చింది. పోలీసులు కుటుంబ సభ్యులకు విషియాన్ని చెప్పడంతో బంధువులు అందరూ ఆందోళనకు గురయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరు హోమ్ క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు. కుటుంబసభ్యులకు ఇవాళ హుటాహుటిన కరోనా పరీక్షలు నిర్వహించారు. గతంలోను ఇలాంటి పొరపాట్లు జరిగాయని.. మరోసారి ఇలా జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులు విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి: