ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్ : నిలిచిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం - corona effect on cricket stadium construction

గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మిస్తున్న ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం పనులు కరోనా వల్ల నిలిచిపోయాయి. మూడేళ్ల క్రితమే అందుబాటులోకి వస్తుందనుకున్న ఈ స్టేడియానికి సంబంధించి 70 శాతం పనులే పూర్తయ్యాయి. విజయవాడ నుంచి 16 కి.మీ., గుంటూరు నుంచి 24 కి.మీ. దూరంలో ఉన్న నవులూరు పంచాయతీ పరిధిలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 2013లో ఈ స్టేడియం నిర్మాణం ప్రారంభమైంది.

కరోనా ఎఫెక్ట్ : నిలిచిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం

author img

By

Published : Nov 1, 2020, 8:01 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మిస్తున్న ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణా పనులు కరోనా వ్యాప్తి కారణంగా ఆఖర్లో నిలిచిపోయింది.

23 ఎకరాల్లో..

విస్తీర్ణం: 23.21 ఎకరాలు (5.5 లక్షల చదరపు అడుగులు)

సామర్థ్యం: 36 వేల మంది ప్రేక్షకులు (కార్పొరేట్‌ బాక్సులతో కలిపి)

అంచనా వ్యయం: రూ.100 కోట్లకు పైగా

ఇప్పటిదాకా ఖర్చైన మొత్తం: రూ.61 కోట్లు

పూర్తయినవి: స్టేడియం లోపలి మైదానం పనులు, భవన సముదాయం, ఎయిర్‌ కండిషనింగ్‌, ఫైర్‌ ఫైటింగ్‌, ఇండోర్‌ స్టేడియం, బీ, సీ మైదానాలు (70 శాతం)

పూర్తి కావాల్సినవి: అంతర్గత మురుగు కాల్వలు, విద్యుత్తు పనులు, రక్షణ గోడ, అంతర్గత రహదార్లు, ఫ్లడ్‌ లైట్లు, లిఫ్టులు, సీటింగ్‌, పెయింటింగ్‌ (30 శాతం)

నిర్మాణం పూర్తయితే..

బీసీసీఐ నుంచి 50 శాతం నిర్మాణ వ్యయం రాయితీగా వెనక్కి వస్తుంది. ఇప్పటికే స్టేడియం లోపలి మైదానం సిద్ధంగా ఉండటంతో బోర్డు మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. రంజీ మ్యాచ్‌లనూ నిర్వహించాక ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌) సభ్యులు తనిఖీ చేసి.. సామర్థ్యం ఉందని నిర్ధరిస్తే అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ స్టేడియం వేదికవుతుంది.

మరిన్ని వసతులు..

ఇప్పటికే ఏసీఏ పరిధిలో విశాఖలో ఉన్న ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు, పలు అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. దీనికి తోడు ఈ స్టేడియమూ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో క్రికెట్‌కు మరిన్ని వసతులు చేకూరినట్లవుతుంది.

ఇప్పటికీ ఒక్కటే..

ఇప్పటి దాకా ఒక్క టోర్నమెంటే జరిగింది. 2020 జనవరిలో బీసీసీఐ బోర్డు అండర్‌ 23 మహిళా టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో 8 రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి.

కరోనా వల్ల ఇబ్బందులు

ఏసీఏకి బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.27 కోట్ల నిధులొస్తాయి. ఏసీఏ ఖర్చులు పోగా మిగిల్చిన నిధులను స్టేడియం నిర్మాణానికి ఖర్చు చేస్తూ వచ్చాం. 2016 సెప్టెంబరులో లోథా కమిటీ ఏర్పాటవడంతో బీసీసీఐ కమిటీ రద్దయింది. ఏసీఏకి అప్పటి నుంచి నిధులు రాలేదు. 2019 అక్టోబరు నుంచి నిధుల మంజూరు తిరిగి మొదలైంది. వాటి నుంచి స్టేడియం అభివృద్ధికి రూ.7 కోట్లు కేటాయించాం. పనులు ప్రారంభించేలోపే కరోనా వ్యాప్తి వల్ల ఇబ్బందులు తలెత్తాయి. మరో నెలలో నిర్మాణం మొదలుపెడతాం.

- ఏసీఏ కార్యదర్శి దుర్గాప్రసాద్‌

ఇవీ చూడండి :

విశాఖలో దారుణం.. ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.