Dhulipalla Narendra: గుంటూరు జిల్లా పెదకాకాని శివాలయం క్యాంటీన్ వ్యవహారం రోజురోజుకు ఉద్రిక్తమవుతోంది. మాంసాహారం వండినవారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు పోలీసులు మాత్రం ఆందోళనలు చేపట్టినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులోభాగంగా తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. గతంలో ఈవో కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన చేపట్టగా.. ఉద్యోగుల విధులకు ఆటంకం, అనుమతి లేకుండా వచ్చారని.. కేసు నమోదు చేశారు. ధూళిపాళ్లతో సహా 93 మందిపై కేసులు పెట్టారు.
ఇదీ చదవండి: