రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న దీక్ష 99వ రోజుకు చేరుకుంది. రైతులు, మహిళలు సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి కొద్ది మంది మాత్రమే దీక్ష చేస్తున్నారు. మిగిలిన వారంతా తమ ఇళ్లలోనే ఎక్కడిక్కడ దీక్షను కొనసాగిస్తున్నారు. ఒకవైపు వైద్యులు, ప్రభుత్వం ఇచ్చిన సలహాలను పాటిస్తూ మరోవైపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాజధాని ప్రాంతంలోని మందడం, కృష్ణాయపాలెం, తుళ్లూరు, వెలగపూడి, రాయపూడి, నెక్కల్లు, వెంకాయపాలెంతో పాటు అన్ని గ్రామాల్లో స్వీయ నియంత్రణలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపడతున్నట్లు రైతులు తెలిపారు.
'సామాజిక దూరాన్ని పాటిస్తూనే నిరసన కొనసాగిస్తాం' - రాజధాని రైతుల తాజా వార్తలు
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు చేస్తున్న దీక్ష 99వ రోజుకు చేరుకుంది. కరోనా కారణంగా దీక్షా శిబిరాల వద్ద పరిమిత సంఖ్యలో కూర్చొని రైతులు నిరసన తెలియజేశారు. కొంతమంది ఇంటి వద్దనే ఆందోళనలు కొనసాగించారు.