ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​.. రాష్ట్రంలో కంట్రోల్​ రూం ఏర్పాటు

రాష్ట్రంలో కరోనా వైరస్​ వ్యాప్తి కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రజలు వదంతులు నమ్మవద్దని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్​రెడ్డి సూచించారు. కరోనా అనుమానితుల వివరాలు తెలిపేందుకు కంట్రోల్​ రూంలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

కరోనా ఎఫెక్ట్​.. రాష్ట్రంలో కంట్రోల్​ రూం ఏర్పాటు
కరోనా ఎఫెక్ట్​.. రాష్ట్రంలో కంట్రోల్​ రూం ఏర్పాటు
author img

By

Published : Mar 12, 2020, 10:12 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ నిరోధక చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్​ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో ఒక కరోనా పాజిటివ్​ కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్​రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని తెలిపారు. 14 రోజుల తర్వాత మళ్లీ నమూనాను పరీక్షించాక డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు. పాజిటివ్‌ ఉన్న వ్యక్తి కలిసిన ఐదుగురినీ 14 రోజులు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని జవహర్‌రెడ్డి చెప్పారు. పూర్తి స్థాయిలో మాస్కులు అందుబాటులో ఉంచినట్లు తెలిపిన ఆయన.. కరోనా అనుమానితుల వివరాలు తెలిపేందుకు కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎలాంటి సందేహం, సమాచారం ఉన్నా... 0866-2410978కు నంబర్​ను సంప్రదించాలని కోరారు.

విదేశాల నుంచి వచ్చేవారు ఇవి పాటించండి

కొవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు వ్యాధి లక్షణాలున్నా.. లేకపోయినా కచ్చితంగా 28 రోజుల పాటు ఇళ్లల్లోనే ఉండాలని జవహర్​రెడ్డి సూచించారు. కుటుంబ సభ్యులతోగానీ, ఇతరులతో గానీ కలవకూడదని అన్నారు. అన్ని జిల్లాల్లోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామని చెప్పారు. కొవిడ్-19 అనుమానిత కేసుల విషయంలో జిల్లా వైద్యాధికారులు, రాపిడ్ రెస్పాన్స్ టీంలు మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని అన్నారు.

వైద్యుల పరిశీలనలో 561 మంది

కరోనా ప్రభావిత దేశాల నుంచి 666 మంది రాష్ట్రానికి వచ్చారని జవహర్​రెడ్డి తెలిపారు. 561 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారని.. 319 మంది ఇళ్లల్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. 233 మందికి 28 రోజుల పరిశీలన పూర్తైనట్లు వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది పరిస్థితి స్థిమితంగా ఉందని పేర్కొన్నారు. 52 మంది నమూనాలను పంపగా 47 మందికి నెగిటివ్‌గా తేలిందని జవహర్​రెడ్డి స్పష్టం చేశారు. ఐదుగురి నమూనాలకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని.. 195 మంది ప్రయాణికుల ఆచూకీ తెలియాల్సి ఉందని అన్నారు.

విమానాశ్రయాల్లోనూ స్క్రీనింగ్​

విమానాశ్రయాలు, ఓడరేవుల్లోనూ స్క్రీనింగ్ చేస్తున్నామని జవహర్​రెడ్డి తెలిపారు. విశాఖ విమానాశ్రంలో 8,386 మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేయగా.. 64 మందికి వ్యాధి లక్షణాలపై అనుమానం కలిగిందని చెప్పారు. విశాఖ, గన్నవరం ఓడరేవులో 1,088 మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేయగా.. అందరికీ కరోనా నెగటివ్ ఫలితం వచ్చినట్టు తెలిపారు. అలాగే.. కృష్ణపట్నంలోనూ 599 మందికి పరీక్షలు నిర్వహించగా ఏ ఒక్కరిలోనూ వ్యాధి లక్షణాలు లేవని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

నెల్లూరు వ్యక్తికి కరోనా పాజిటివ్.. యంత్రాంగం అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.