ETV Bharat / state

AP Electricity Employees PRC: విద్యుత్‌ పీఆర్‌సీపై అంగీకారం.. ఒప్పందాలపై సంతకాలు చేసిన ఇరుపక్షాలు - సింగిల్ మాస్టర్ స్కేల్ విధానం

AP Electricity Employees PRC: విద్యుత్‌ ఉద్యోగుల డిమాండ్లపై కార్మికులకు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికులు, ఇతర సిబ్బందికి అమలు చేసే కొత్త వేతన సవరణ ఒప్పందాన్ని అంగీకరిస్తూ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి, యాజమాన్యం సంతకాలు చేశాయి.

AP_Electricity_Employees_PRC
AP_Electricity_Employees_PRC
author img

By

Published : Aug 17, 2023, 4:03 PM IST

AP Electricity Employees PRC: విద్యుత్ సంస్థల్లో పని చేసే వర్క్​మెన్, ఇతర సిబ్బందికి అమలయ్యే కొత్త వేతన సవరణ ఒప్పందాన్ని అంగీకరిస్తూ (పీఆర్​సీ) ఉద్యోగుల ఐకాస, యాజమాన్యం సంతకాలు చేశాయి. సవరించిన వేతనాలు 2022 ఏప్రిల్ నుంచి వర్తిస్తాయి. ఈ మేరకు విద్యుత్ యాజమాన్యం, ఉద్యోగ సంఘాల ఐకాస నేతల మధ్య బుధవారం రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘ చర్చలు జరిగాయి. అనంతరం ఒప్పందంపై సంతకాలు చేయడానికి జేఏసీ నేతలు అంగీకరించారు. 8 శాతం ఫిట్​మెంట్​, ఇతర మార్పుల కారణంగా చెల్లించాల్సిన పీఆర్సీ బకాయిలను 12 వాయిదాల్లో చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది.

Electricity Workers Protest Program: విద్యుత్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్​ ధర్నా వాయిదా

Key Elements in Agreement of Electricity Employees PRC : ఒప్పందంలో కీలక అంశాలు : కొత్త ఒప్పందం ప్రకారం విద్యుత్ సంస్థల్లో మొదటిసారి సింగిల్ మాస్టర్ స్కేల్ విధానం అమలులోకి వచ్చింది. ఈ మేరకు 24.99 శాతం డీఏ, 8 శాతం ఫిట్మెంట్ కలిపి పే స్కేల్ కనిష్ఠంగా రూ.29వేల 100, గరిష్టంగా రూ.2లక్షల 59వేల 895 నిర్ణయమైంది. టైమ్ స్కేల్ ఆధారంగా నాలుగు స్టాగ్నే టెడ్ ఇంక్రిమెంట్లతో పాటు, ఇతర ఎలవెన్సులు చెల్లింపులకు సంబంధించిన నిబంధనలను ఒప్పందంలో చేర్చారు. పింఛను పొందే వారికీ పీఆర్​సీ ప్రకారం 8% ఫిట్​మెంట్ 2022 ఏప్రిల్ నుంచి వర్తిస్తుంది.

TDP Fire on Power Cuts : 'అప్రకటిత కరెంటు కోతలు, అడ్డగోలు బిల్లులు.. 'జె టాక్స్‌' భారం ప్రజలపై వేస్తారా..' : టీడీపీ

సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత.. పీఆర్సీ పై అధ్యయనానికి ప్రభుత్వం రిటైర్డు ఐఏఎస్ అధికారి మన్మోహన్​ సింగ్​ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొత్త పీఆర్సీ పై ఉద్యోగ సంఘాలతో యాజమాన్యం సుధీర్ఘంగా చర్చలు జరిపింది. 29 సార్లు చర్చలు జరిగాయి. ఎట్టకేలకు పీఆర్​సీ ఒప్పందంపై ఉద్యోగ సంఘాలు సంతకాలు చేశాయి. యాజమాన్యం తరఫున జెన్​కో ఎండీ చక్రధర్​ బాబు, జేఎండీ (విజిలెన్స్) మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు పృధ్వీతేజ్, సంతోషరావు. పద్మాజనార్దన్ రెడ్డి, జెన్ కో డైరెక్టర్​ వెంకటేశులు రెడ్డి సంతకాలు చేశారు.

Talks with AP Govt Fail - Power Employees Strike From 10th: చర్చలు విఫలం.. 10 నుంచి విద్యుత్​ ఉద్యోగుల నిరవధిక సమ్మె

CM Jagan Key Decision on Contract Employees Regularization: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణలో 5 ఏళ్ల నిబంధనను తొలగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. 2014 జూన్ 2 తేదీనాటికి 5 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు గత కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నారని అయితే ఇప్పుడు ఆ నిబంధనను తొలగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి జగన్ సంతకం కూడా చేశారని మరో నాలుగైదు రోజుల్లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయకపోయినా 5 ఏళ్ల నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్టు స్పష్టం చేశారు.

APPCB Recruitment : ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో 29 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ ద్వారా ఏపీ పీసీబీలో సహాయ పర్యావరణ ఇంజనీర్లు పోస్టులు 21, గ్రేడ్ 2 అనలిస్టులను భర్తీ చేసేందుకు ఆమోదాన్ని తెలిపింది. పోస్టుల భర్తీకి సంబందించిన వ్యయాన్ని అంతర్గత ఆర్ధిక వనరుల ద్వారానే భరించాలని కాలుష్య నియంత్రణ మండలికి సూచిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈమేరకు ఆర్ధికశాఖ మానవ వనరుల విభాగం ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి ఉత్తర్వులను జారీ చేశారు.

No permission for Chalo Vidyut Soudha : ఈ నెల 17 విద్యుత్ సౌధ ముట్టడికి ఉద్యోగుల పిలుపు.. అనుమతి లేదంటున్న సీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.