"లాలూచీ కోసమే.. ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ" వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలే తప్ప.. ప్రజల కోసం ఒక్క పని చేయటం లేదని గుంటూరులో తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజా మండిపడ్డారు. తన కేసులు మాఫీ చేయించుకోవటం కోసమే జగన్ దిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారని ఆరోపించారు. 25 మంది ఎంపీలుంటే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఒకప్పుడు సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసినవాళ్లు తెలంగాణంలో ఉండొద్దన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో ఏ విధంగా స్నేహం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇదీ చదవండి : 'విపత్తులు ఎదుర్కోవటంలో.. సీఎం జగన్ విఫలం'