తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామివారి కొండపై చోరీ జరిగింది. రెండు హుండీలను పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. ప్రతి రోజూ మాదిరిగానే ఇవాళ ఉదయం అర్చక స్వాములు నిత్య దీప ధూప నైవేద్యం కోసం ఆలయ తలుపులు తెరవగానే చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వేలిముద్రలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: