ప్రభుత్వ కార్యాలయాల్లో పాలనా భాషగా తెలుగును చిత్తశుద్ధితో అమలు చేయాలని రాష్ట్ర అధికార భాషా సంఘం గౌరవ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో తెలుగు భాష అమలుపై కీలక శాఖల అధికారులతో కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు.
తెలుగు భాష, తెలుగు సాహిత్యానికి గోదావరి జిల్లాలు పెద్దపీట వేశాయని అన్నారు. ఎనిదేళ్లుగా సంఘం, కార్యాలయం లేకుండా ఉన్న పరిస్థితుల్లో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 3 నెలలుకే అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేసి తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేస్తున్నారని అన్నారు. అధికార భాషాభివృద్ధికి సిఫార్సులతో కూడిన నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తామని యార్లగడ్డ తెలిపారు.
ఇదీ చదవండి: