జగ్గంపేటలో..
జగ్గంపేటలోని తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం 40వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై నందమూరి తారకరామరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెదేపా కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
కొత్తపేటలో...
కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలంలోని ఆయా గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
అమలాపురంలో...
అమలాపురం డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజవొమ్మంగిలో...
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజవొమ్మంగిలో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఎన్ఠీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు ఏజెన్సీ ప్రాంతంలో చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు.
రంపచోడవరంలో..
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని రంపచోడవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంఛార్జి వంతల రాజేశ్వరి.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు.