తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పెద్ద మల్లాపురంలో... సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను స్థానికులు గదిలో పెట్టి బంధించారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న 56 గ్రామాలను ఐటీడీఏ పరిధిలో చేర్చడానికి ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించాలని అధికారులను కోరింది. ఈ క్రమంలో గ్రామ సభలు నిర్వహించకుండా, స్థానికుల అభిప్రాయాలు తీసుకోకుండా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు తప్పుడు తీర్మానాలు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలంటూ నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా పెద్ద మల్లాపురంలో సచివాలయం సిబ్బందిని నిర్భందించారు. సమస్య పరిష్కరిస్తామన్న ఉన్నతాధికారుల సూచనతో సిబ్బందిని విడిచిపెట్టారు.
ఇదీ చదవండి.