ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు

author img

By

Published : Mar 11, 2021, 12:44 PM IST

Updated : Mar 11, 2021, 12:56 PM IST

రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాలల్లో శివరాత్రిని ఘనంగా నిర్వహిస్తున్నారు. శివుడిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తూర్పుగోదావరి జిల్లాలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు
తూర్పుగోదావరి జిల్లాలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు

కాకినాడలో ఘనంగా శివరాత్రి

తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శివరాత్రి ఘనంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు తరలివచ్చారు. అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శివనామస్మరణలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. రామారావుపేట అన్నపూర్ణసమేత శ్రీ విశ్వేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిలాడుతోంది. దేవాలంయం వీధిలోని పెద్ద శివాలయం, భానుగుడి శివాలయానికి భారీగా తరలి వచ్చారు

అనపర్తి నియోజకవర్గంలో శివనామస్మరణ..

అనపర్తి నియోజకవర్గంలో శైవ క్షేత్రాలు కళకళలాడాయి. అనపర్తి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేకువజాము నుంచి మహాదేవునికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పుష్పాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పెద్దఎత్తున ఆలయానికి వచ్చిన భక్తులు ద్వజస్థంబాలు, తులసికోటల వద్ద దీపారాధన చేశారు. భక్తులు సమర్పించిన పంచామృతాలతో ఆలయ అర్చకులు దేవాదిదేవుడికి అభిషేకాలు చేశారు. బోళా శంకరుణ్ణి దర్శించుకొనేందుకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు.

కొత్తపేట నియోజక వర్గంలోని పరమేశ్వరుడికి పూజలు

కొత్తపేట నియోజక వర్గంలోని శివ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన కొత్తపేట మండలం పలివెల శ్రీ ఉమాకొప్పెశ్వరస్వామి దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. వేలాది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఇబ్బందులు లేకుండా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు

పాదగయ క్షేత్రంలో శివునికి పూజలు

పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని..పూజలు నిర్వహిస్తున్నారు.

కోనసీమలో మహాశివరాత్రి వేడుకలు

తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు పరమశివుని దర్శించుకుని అభిషేకాలు పూజలు చేస్తున్నారు.

అమలాపురం సిద్ధేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

అమలాపురంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దర్శనం కోసం భక్తజనం బారులు తీరారు. పరమశివుడు దర్శించుకుని భక్తులు పూజలు అభిషేకాలు చేస్తున్నారు. ఈరోజు రాత్రి అఖండ దీపార్చన చేయనున్నారు.

మహాలింగానికి అభిషేకం

యానంలో గౌతమి గోదావరి చెంతన ఉన్న మహా శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు క్రేన్ సహాయంతో వెళ్లి పంచ ద్రవ్యాలు పాలతో అభిషేకం చేశారు.. రాజరాజేశ్వరి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..

ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో రద్దీ

తూర్పు గోదావరి జిల్లా పంచారామ క్షేత్రం, 12వ శక్తి పీఠమైన శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి పర్వదినం కావడంతో వేకువజాము నుంచే భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు శానిటైజర్స్ ఏర్పాటు చేశారు.

రంపచోడవరం శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం ప్రసిద్ధిగాంచిన శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. కొండ పైన ఉన్న శివునితో పాటు జలపాతాన్ని సందర్శించి భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కొండ దిగువన ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తును కల్పించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య ఆదేశాల మేరకు ఆర్డీఓ శీను నాయక్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ముక్తేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు..

సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తిచే ప్రతిష్టింపబడిన తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో శివరాత్రిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ముక్తి కాంతా సమేత క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు వచ్చారు. పలువురు పిండ ప్రదానాలు చేశారు. గౌతమి తొగర్రాయిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. పరమశివుడికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు.

ప్రత్తిపాడు నియోజకవర్గంలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు

ప్రత్తిపాడు నియోజకవర్గంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి... ఏలేశ్వరంలో ఏలేరు నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి.. శివాలయంలో పూజలు నిర్వహించారు...

ప్రత్తిపాడు మండలంలో ధర్మవరం, వొమ్మంగి, ఎరకంపాలెం, దారపల్లి గ్రామాలలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి... రాచపల్లిలో అరుణాచల ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శంఖవరం. రౌతులపూడి మండలంలో ఆలయాలన్నీ శివనామ స్మరణతో మార్మో మోగుతున్నాయి.

కోటిపల్లిలో ముక్కంటికి పూజలు

కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వరస్వామి వారి ఆలయంలో మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామునుంచి భక్తులు ఆలయాలకు వచ్చారు.
ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్యూలైన్లు ఏర్పాటు చేశారు అధికారులు. గౌతమి గోదావరి వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు.

భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజోలు దీవిలోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మారుమోగుతున్నాయి. శివకోడు, రాజోలు ,చింతలపల్లి, కడలి, అంతర్వేది, రామేశ్వరం, తదితర గ్రామాలలోని శివాలయాలలో ..భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో శైవక్షేత్రాలు అన్నీ కిటకిటలాడుతున్నాయి.

ఇదీ చూడండి.

రంగంపేటలో ఆకట్టుకుంటున్న శివుని సైకత శిల్పం

Last Updated : Mar 11, 2021, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.