తూర్పుగోదావరి కోనసీమ ప్రాంతంలో గోదావరి వరద నెమ్మదించినప్పటికీ లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అప్పనపల్లి, చాకలి పాలెం, ముక్తేశ్వరం వద్ద కాలువలపై వరద నీరు ప్రవహిస్తుంది. లంక గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు వరద ముంపులోనే ఉన్నాయి. లంక గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంలోనికి రావడానికి అవస్థలు పడుతున్నారు.
ఇదీ చదవండి:అన్యాయం చేయకండి.. విధుల్లోకి తీసుకోండి!