తూర్పుగోదావరి జిల్లా.. కిర్లంపూడి మండలం కృష్ణవరంలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. వైకాపాకు చెందిన చాగంటి రాజాకు తెదేపాకు చెందిన పల్లయ్యకు మధ్య వివాదం జరిగింది. వైకాపా వర్గీయులు తెదేపా నాయకుల ఇంటిపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ద్విచక్ర వాహనాలూ ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘటనాస్థలిని పరిశీలించారు. ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్న వారిపై చర్యలకు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి...