తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల గ్రామ మెయిన్ రోడ్డులో గల పెట్రోల్ బంక్ వద్ద.. ప్రమాదం జరిగింది. మద్యం సరుకుతో ప్రయాణిస్తున్న వ్యాను బోల్తా పడింది. రాజమండ్రి నుంచి కోరుకొండ ప్రభుత్వ మద్యం దుకాణానికి మద్యం లోడు తీసుకెళుతుండగా.. ప్రమాదం జరిగింది. కొన్ని మద్యం బాటిళ్లు రోడ్డుపై పడటంతో వాహనదారులు వాటిని తీసుకెళ్లగా.. మరికొన్ని నేలపాలయ్యాయి.
ఇదీ చదవండి:
ఆసుపత్రుల్లో కరోనా పడకలకు డిమాండు.. సిఫార్సు ఉంటేనే ప్రైవేటులో అందుబాటు!