SP Rishanth Reddy Controversial Style : చిత్తూరు ఎస్పీ రిశాంత్‌రెడ్డి వ్యవహార శైలి తొలి నుంచి వివాదాస్పదమేనని, పోలీస్ శాఖపై ప్రజల్లో గౌరవం పెరగాలంటే ఆయన్ను సస్పెండ్ చేయాలని అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన సంతోష్‌కుమార్ మీడియా ద్వారా డీజీపీని కోరారు. సోమవారం సాయంత్రం విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ రిశాంత్‌రెడ్డి తొలి బాధితుడిని తానేనని వాపోయాడు. 2019లో టీడీపీ నిర్వహించిన బైక్‌లో ర్యాలీలో పాల్గొన్నందుకు అప్పటి ఏఎస్పీ హోదాలో రిశాంత్‌రెడ్డి తనను చావబాదారని వివరించారు. తలపై రివాల్వర్‌పెట్టి ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించడంతో పోలీసు స్టేషన్ పైనుంచి కిందపడి కాళ్లు విరగ్గొట్టుకున్నట్లు తెలిపారు. దీనిపై అప్పటి డీజీపీకి ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అప్పుడే ఆయన్ను సస్పెండ్ చేసి ఉంటే.. పుంగనూరు(Punganur), కుప్పం గొడవలు జరిగే ఉండేవి కాదన్నారు. ఇప్పటికైనా ఎస్పీ రిశాంత్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని బాధితుడు వేడుకున్నాడు.
police harassment: ప్రాణాల మీదకి తెచ్చిన స్నేహితుడి ప్రేమ పెళ్లి.. యువకుడికి పోలీసుల టార్చర్!
'‘2019 సెప్టెంబరు 4వ తేదీన నర్సీపట్నంలో టీడీపీ(TDP) ప్రధాన కార్యదర్శి చేపట్టిన బైక్ ర్యాలీలో నేను పాల్గొన్నా... ఆ సమయంలో రిషాంత్‌రెడ్డి నా దగ్గరకొచ్చి, ర్యాలీకి అనుమతి లేదు... ఎందుకు పాల్గొన్నావని పరుషంగా మాట్లాడి అదుపులోకి తీసుకున్నాడు. ఆ తర్వాత సెప్టెంబరు 13న నర్సీపట్నం స్టేషన్‌లోని పై అంతస్తులో చీకటి గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు' అని ఎస్పీ రిశాంత్ రెడ్డి బాధితుడు ఎల్లేటి సంతోష్ తెలిపాడు.
Youngman suicide Attempt: పోలీసుల వేధింపులు.. యువకుడి ఆత్మహత్యా యత్నం
Legs Surgery 'కర్రలతో పాదాల కొడుతూ, పైకి, కిందికి పరిగెత్తిస్తూ చిత్రహింసలు పెట్టడంతో పాటు.. రిషాంత్‌రెడ్డి నా తలపై రివాల్వర్ పెట్టి ఎన్‌కౌంటర్‌లో లేపేస్తానని బెదిరించారు. నేను ఏ తప్పూ చేయలేదని ఆయన కాళ్లు పట్టుకొని వేడుకున్నా వదల్లేదు. బాధ తట్టుకోలేక పరిగెత్తే క్రమంలో పోలీస్‌స్టేషన్ మొదటి అంతస్తు నుంచి కిందపడి నా రెండు కాళ్లూ విరిగిపోయాయి. అయినా సరే.. పోలీసులు పక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రికి కాకుండా చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసి మా కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి, తిరిగి విశాఖ కేజీహెచ్(Visakha KGH)కు తరలించడంతో డాక్టర్లు రెండు కాళ్లకు శస్త్రచికిత్స చేసి రాడ్లు వేశారు.
Human Rights Commission నాకు జరిగిన అన్యాయంపై అప్పటి విశాఖపట్నం ఎస్పీ, డీజీపీలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. మానవ హక్కుల కమిషన్, నర్సీపట్నం కోర్టులోనూ ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించినా పోలీసులు స్పందించలేదు. మానవ హక్కుల కమిషన్ స్పందించి వృద్ధాప్యంలో ఉన్న నా తల్లి పోషణ కోసం పోలీసు శాఖ నుంచి రూ.2 లక్షలు ఇప్పించింది. అసలు.. అప్పుడే గనుక రిషాంత్‌రెడ్డిపై పోలీస్ శాఖ చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు పుంగనూరు, కుప్పంలో అరాచకాలు జరిగేవి కావు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలగాలంటే వెంటనే రిషాంత్‌రెడ్డిపై కేసు నమోదు చేసి, సస్పెండ్ చేయాలి. దీని వల్ల పోలీసు అధికారుల్లో కూడా బాధ్యత పెరిగి సామాన్యులపై వేధింపులు తగ్గిపోతాయి. రిషాంత్ రెడ్డి బాధితులు నాలాంటి వాళ్లు ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఈ విషయాలను బయట పెడుతున్నందుకు నాకు ప్రాణహాని ఉంది'. అని ఎల్లేటి సంతోష్ మీడియా వద్ద వాపోయాడు.