ETV Bharat / state

'ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా గనుల తవ్వకాలకు అనుమతివ్వం' - chittoor latest news

అభివృద్ధి పేరుతో తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్యకొండలో ఖనిజాలు తవ్వుతున్నారనే దుష్ప్రచారాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఖండించారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా గనుల తవ్వకాలకు అనుమతివ్వమని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ ఎలాంటి గనుల తవ్వకాలు చేపట్టడం లేదని అన్నారు.

minister peddireddy
మల్లయ్యకొండలో ఖనిజాల తవ్వకాలు
author img

By

Published : Jul 14, 2021, 10:55 PM IST

ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా గనుల తవ్వకాలకు అనుమతివ్వమని గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మల్లయ్యకొండలో గనుల తవ్వకాలకు అనుమతిస్తారంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని పుణ్యక్షేత్రం మల్లయ్య కొండ శ్రీబ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయం జీర్ణోర్థరణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. ఆలయం నిర్మాణానికి 3.20 కోట్ల రూపాయలు, రహదారికి 6.50 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

కొండపై ఉద్యాన వనం, అతిథి గృహాల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. వచ్చే ఏడాది మహా శివరాత్రి నాటికి నిర్మాణాలు పూర్తి చేసి మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. అభివృద్ధి పేరుతో ఖనిజాలు తవ్వుతున్నారనే దుష్ప్రచారంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా చేపట్టిన అభివృద్ధి పనులే ఆరోపణలకు సమాధానం చెబుతాయని మంత్రి అన్నారు.

ఇదీ చదవండి:

CM JAGAN FAN: సీఎం జగన్​ను కలవాలని అభిమాని హడావుడి.. కానీ..!

రాజ్యసభలో అధికారపక్ష నేతగా గోయల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.