గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల శ్రీవారు ఒకే నెలలో 3 సార్లు గరుడ వాహనంపై విహరించనున్నారు. సాధారణంగా బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతినెలా పౌర్ణమి రోజున మలయప్పస్వామికి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. అయితే పౌర్ణమి సందర్భంగా అక్టోబర్ నెల 1న, 31న... అదేవిధంగా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 20న గరుడ వాహనంపై వేంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వనున్నారు.
బ్రహ్మోత్సవాల వేళ గరుడవాహనంపై ఆసీనులైన మలయప్పను దర్శించుకోవటానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల తరలివస్తారు. అయితే ఈ ఏడాది కోవిడ్ నిబంధనల కారణంగా శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు.