చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో... డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం... జిల్లా పాలనాధికారి భరత్గుప్తాను కలిశారు. దళితుల కల్యాణ మండపం విషయం గురించి చర్చించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ ట్రస్ట్ భవన్ వెనుక ఉన్న ఆర్టీసీ స్థలాన్ని... కల్యాణ మండపానికి కేటాయించగా దాన్ని వారు పరిశీలించారు.
సంబంధిత ఫైలును తనకు పంపాలని తహసీల్దార్ జయరాములుకు కలెక్టర్ భరత్ గుప్తా ఆదేశించారు. ఈ విషయంపై నగరి ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా ఎలా పర్యటిస్తారని పత్రికలు, చానల్లో వాయిస్ మెసేజ్ పెట్టడం వివాదంగా మారింది.
ఇదీ చదవండి: