తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతిలో యూత్ కాంగ్రెస్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన యువక్రాంతి నాయకత్వ అభివృద్ధి శిక్షణా శిబిరాలను ఆయన ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ రాష్ట్రస్థాయి కార్యశాలలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి యూత్ కాంగ్రెస్ నాయకులు తరలివచ్చారు.
కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలపర్చేందుకు..యువతలో నాయకత్వ పటిమను పెంచేందుకు ఈ శిక్షణా శిబిరాలు ఉపయుక్తంగా ఉంటాయని తులసిరెడ్డి అన్నారు. జరగబోయే తిరుపతి పార్లమెంటరీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో ఉంచుతామన్న ఆయన...మిగిలిన పార్టీలకు సాధ్యం కాని రికార్డు తిరుపతిలో కాంగ్రెస్కు ఉందన్నారు.
ఇదీచదవండి