హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ 2019 ముగిసింది. 79వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ముగింపు వేడుకలకు తెలంగాణ శాసనసభాపతిపోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నుమాయిష్‌తో తనకున్న అనుబంధాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీకి వచ్చే ఆదాయం ద్వారా 18 విద్యా సంస్థలను నడపటం అభినందనీయమని కొనియాడారు. ప్రదర్శనకు సహకరించిన పోలీస్, ట్రాఫిక్, మెట్రో, విద్యుత్, అగ్నిమాపక శాఖల అధికారులకు స్పీకర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ ప్రదర్శనలో ఉత్తమ స్టాల్ నిర్వాహకులకు బహుమతులు ప్రదానం చేశారు.
విషాదం మిగిల్చినఅగ్నిప్రమాదం
నుమాయిష్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఈ సారి భారీ అగ్ని ప్రమాదం జరగడం నిర్వాహకుల్లోవిషాదాన్ని నింపింది. దాదాపు 40 స్టాళ్లు అగ్నికి ఆహుతవడం.. కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎగ్జిబిషన్ స్టాళ్లకు అనుమతుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆదేశాలు జారీ చేసింది. ఎగ్జిబిషన్‌ను కొన్ని రోజుల పాటు కొనసాగించింది.