పలువురికి సహాయపడుతూ...ఆకలితో ఉన్నవారికి అన్నంపెడుతూ..ఓ దివ్యాంగుడు తన దాతృత్వాన్ని చాటుతున్నాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఉద్దీప్ సిన్హా అనే దివ్యాంగుడు లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఆపన్నులకు, బిచ్చగాళ్లకు సేవ చేస్తున్నాడు. పేదలకు అన్నదానంతోపాటు... వలస కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. పట్టణంలోని కొంతమంది బిచ్చగాళ్లకు క్షవరం, స్నానం చేయించి..వారికి దుస్తులను అందించాడు. వారు తినడానికి భోజన ఏర్పాట్లు ..చేసి మానవత్వాన్ని చాటాడు. ఉద్దీప్ సిన్హా.. సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇదీచూడండి. 'శిశుపాలుడిలా తప్పులు చేస్తూనే ఉన్నారు'