అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ద్విచక్రవాహనంపై కళాశాలకు వెళ్తున్న ముగ్గురు విద్యార్థులను బొలేరో వాహనం ఢీకొట్టింది. దేవరాజ్, శివకుమార్, రోజా అనే ముగ్గురు విద్యార్థులు మోటార్ సైకిల్‌పై కళాశాలకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: ఆయిల్ ట్యాంకర్ బోల్తా... ఇద్దరికి గాయాలు